మోడీ అధికార మదంతో వ్యవహరిస్తున్నారు - చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ  అధికార మదంతో వ్యవహరిస్తున్నారని, అందుకే అవిశ్వాసం సందర్భంగా తమపై చౌకబారు ఆరోపణలు చేసారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.  అవిశ్వాసం వీగిపోయిన సందర్భంగా అమరావతిలోని సెక్రటేరియట్లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విధంగా అన్నారు. 

అవిశ్వాసం సందర్భంగా కేంద్రం తన తప్పులకు పశ్చాత్తాపపడి, తప్పులను సరి చేసుకుంటుందని భావించామని, కానీ విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు ఎటువంటి న్యాయం జరగలేదని, తీవ్ర నిరాశ చెందామని వ్యాఖ్యానించారు.  

ప్రధాన మంత్రికి గర్వం ఉంది. అతను అధికారం వల్ల వచ్చిన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పద్దతిలో వెక్కిరిస్తూ మాట్లాడాడు. మాపై చౌకబారు ఆరోపణలు చేసాడు. అన్నారు. కనీసం ఇప్పటికైనా న్యాయం చేస్తామని చెప్పలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. 

తెలుగుదేశం చివరి అస్త్రంగా మాత్రమే అవిశ్వాసాన్ని ప్రయోగించిందని, కేంద్రం తో పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలియచేసారు. ఈ నెల 21న ఢిల్లీకి వెళ్లి వివిధ పార్టీల నాయకులను కలిసి మద్ధతు కూడగడుతానని చంద్రబాబు అన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post