రాహుల్ ఒక్క మసీదును కూడా సందర్శించలేదు

రాహుల్ ఒక్క మసీదును కూడా సందర్శించలేదు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రంలోని సుమారు 50 ఆలయాలను సందర్శించినట్లు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి తెలియజేశారు. అయితే ఆ సమయంలో ఏ ఒక్క  మసీదుకు వెళ్ళలేదని, ఈ విషయం ఆయన దృష్టిలో ముస్లింలకు ఎంత  విలువ ఉందో స్పష్టం చేస్తుందని ఆయన విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. 

ఒవైసి కాంగ్రెస్ ను గర్విష్టి పార్టీగా అభివర్ణించారు. ఆ పార్టీ నాయకులు తాము పాలించటానికే జన్మించినట్లు భావిస్తారు. ఇటువంటి ఆలోచనలే ఆ పార్టీని నాశనం చేసాయని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. 

కాంగ్రెస్ కు మైనారిటీల ఓట్లు రాకుండా ఉండటానికి, మరియు బిజెపిని గెలిపించటానికే ఎంఐఎం పార్టీ వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నదన్న వ్యాఖ్యకు బదులిస్తూ తాము కర్ణాటక మరియు గుజరాత్ లలో ఒక్క సీటులో కూడా పోటీ చేయలేదని, అయినా కాంగ్రెస్ ఎందుకు విజయం సాధించలేక పోయిందని ఎదురు ప్రశ్నించారు. మేము పోటీ చేయని చోట కూడా ఆ పార్టీ మైనారిటీల ఓట్లను తెచ్చుకోలేకపోయిందని ఒవైసి అన్నారు. ఆ పార్టీ అధ్వాన్నమైన పనితీరును కప్పిపుచ్చుకునేందుకే అటువంటి కుంటిసాకులు వెతుక్కుంటోందని ఆయన మండి పడ్డారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post