ప్రధాన మంత్రి సీటులో కూర్చోవాల్సిన వ్యక్తి మోడీ ఒడిలో కూర్చున్నాడు.

బీజేపీతో పోరాడుతాడని 2015 బీహార్ ఎన్నికలలో ముస్లింలు నితీష్ కుమార్ కు ఓటు వేస్తే ఆయన మోసం చేశారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసి ఆరోపించారు.  ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉండవలసిన నితీష్ కుమార్, ఇప్పుడు ప్రధానమంత్రి ఒడిలో కూర్చున్నాడని విలేఖరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన వ్యాఖ్యానించారు. 

బీహార్లో 2015 అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని సాధించిన జెడి (యు), ఆర్జెడి, కాంగ్రెస్ లతో కూడిన గ్రాండ్ అలయెన్స్ కు నితీష్ కుమార్ తిరిగి వస్తారా అన్న ప్రశ్నకు అది ఊహ జనితమని చెప్పి సమాధానమిచ్చేందుకు ఒవైసి నిరాకరించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post