రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానంపై తన ఉపన్యాసం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ దెగ్గరకు వెళ్లి నాపై మీకు ద్వేషం ఉండొచ్చు.. నాకు మీపై ప్రేమనే ఉంది. అని షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత వెంటనే ఆయనను ఆలింగనం చేసున్నారు. దీనికి మోడీతో సహా అందరూ షాక్ అయ్యారు. ఇది చాలదన్నట్లు కూర్చున్న వెంటనే కన్ను గీటారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్, దీనిని రాహుల్ పిల్ల చేష్ట గా అభివర్ణించాడు. రాహుల్ సభలో చిప్కో ఉద్యమాన్ని మొదలుపెట్టారని రాజ్ నాథ్ సింగ్ అనగా, ఇది సభా సాంప్రదాయాలను ఉల్లంఘించడమేనని స్పీకర్ అన్నారు. సభలో హుందాగా ప్రవర్తించాలని ఆవిడ కోరారు.
ఈ సంఘటన పార్లమెంట్ సభ్యులకు ఆసక్తిని కలిగించగా ట్విట్టర్ ట్రోల్ కి పండుగలా మారింది.
ఈ సంఘటన పార్లమెంట్ సభ్యులకు ఆసక్తిని కలిగించగా ట్విట్టర్ ట్రోల్ కి పండుగలా మారింది.
మోడీ ఎక్కడకు వెళ్లినా, ఎవరు ఇక్కడికి వచ్చినా ఆలింగనం చేసుకొని ఆహ్వానం పలుకుతారు. ఇప్పుడు రాహుల్ దానికి ప్రతీకారం తీర్చుకున్నారు అని ఒకరు, రాహుల్ ప్రియా ప్రకాష్ తో పోటీ పడ్డాడు అని మరొకరు ఇలా చాలా జోకులు పేలుతున్నాయి.
Post a Comment