ఆ ఏడు మండలాలను తెలంగాణాలో కలపాలి

ఆ ఏడు మండలాలను తెలంగాణాలో కలపాలి
లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని అన్నారు. మోడీ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వారి తొలి నిర్ణయమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ కలపడం బాధ పెట్టిందని అన్నారు. విభజన చట్టాన్ని సవరించి ఆ ఏడు మండలాలను తెలంగాణకు తిరిగివ్వాలని కోరారు. విద్యుత్ విషయంలో తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సీలేరు పవర్ ప్లాంటును బలవంతంగా లాక్కున్నారని అన్నారు. 

రాష్ట్రప్రభుత్వం భూకేటాయింపులు జరిపినా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ, నేషనల్ హైవే ప్రాజెక్టులు, నేషనల్ థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖత చూపడం లేదని ఆరోపించారు. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలనే ఆనవాయితీ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టును తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్నారు. చంద్రబాబు హైకోర్ట్ విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.  

0/Post a Comment/Comments