టిఆర్ఎస్ వైఖరిపై విస్మయం

టిఆర్ఎస్ వైఖరిపై విస్మయం
ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక హోదాను వ్యతిరేకించడం పై విస్మయం వ్యక్తం చేసారు. కొన్ని రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, కెటిఆర్, కవిత మరియు ఆ పార్టీ ఇతర నాయకులు దీనిని బహిరంగంగా సమర్థించారని ఆయన అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఆందోళన సందర్భంగా కూడా కెసిఆర్ తెలంగాణ ఏర్పాటు చేయాలని, ఆంధ్ర ప్రదేశ్ కు అవసరమైన సహాయం చేయాలని కోరినట్లు గుర్తు చేసారు. 

ఇన్నిసార్లు ప్రత్యేక హోదా ను సమర్ధించిన టిఆర్ఎస్ ఇప్పుడు బిజెపికి సహాయపడటానికే వ్యతిరేకంగా మాట్లాడుతోందని రఘువీరా ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదాను ఇతర రాష్ట్రాలతో పోల్చలేమని, అది రాష్ట్రానికి విభజన వల్ల వచ్చిన హక్కని ఆయన అన్నారు. 

0/Post a Comment/Comments