ఆర్టీసీకి కలిసొచ్చిన లారీల సమ్మె

ఆర్టీసీకి కలిసొచ్చిన లారీల సమ్మె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC), ఈ వారంలో లారీల సమ్మె కారణంగా తమ పార్సెల్ సర్వీసు ద్వారా అదనంగా కోటి రూపాయలు సంపాదించింది. ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం ముగిసిన తరువాత, APSRTC ఈ మధ్యకాలంలోనే తన సొంత పార్సెల్ సర్వీసును ప్రారంభించింది.

ప్రతినెల సంస్థ పార్సెల్ సర్వీసు ద్వారా 6 కోట్లు సంపాదిస్తుండగా, ఈ నెలలో అదనంగా 1 కోటి రూపాయలు వచ్చినట్లు చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎన్ గోపీనాథ్ రెడ్డి తెలియచేసారు. సంస్థ వినియోగదారులకు డోర్ టు డోర్ పార్సెల్ సేకరణ మరియు డెలివరీ సేవలను అందిస్తుందని, ఎక్కువ మంది ప్రజలు వినియోగించుకోవలసిందిగా ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపోలలో 126 పార్సెల్ కౌంటర్లు పనిచేస్తున్నాయి, మరియు దాదాపు 200 ఏజెంట్ల నియామకం జరిగింది. తెలంగాణలో కూడా 25 మందితో ఏజెంట్లు ఉన్నారు. అని ఆయన అన్నారు.

మా సేవలతో వినియోగదారులు సంతృప్తి చెందటం వల్లే సంవత్సరానికి 70 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కమర్షియల్) ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post