హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణన్

హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణన్
జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ గారు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుతో , సెంట్రల్ అపాయింట్‌మెంట్ కమిటీ, రాష్ట్రపతి ఆయనను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ మేరకు ఈ నెల 16లోపు బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ జస్టిస్ రమేశ్ రంగనాథన్ గారు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post