హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టితిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చేత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. మూడేళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించారు.
1959 ఏప్రిల్ 29న రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో జన్మించారు. కర్ణాటకలో న్యాయవిద్య పూర్తిచేసి, తిరువనంతపురం బార్ కౌన్సిల్‌లో 1983లో పేరు నమోదు చేసుకున్నారు. 2004లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 మార్చి 18న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 15 నెలలపాటు అక్కడే బాధ్యతలు నిర్వహించారు.
Post a Comment