కాశ్మీర్లో నిరసనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), దుఖ్తరన్-ఎ-మిలాట్ చీఫ్ అసియా ఆండ్రబీని కస్టడీలోకి తీసుకున్నందుకు కాశ్మీర్ లోయలో పాటిస్తున్న బంద్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
ఖుద్వానిలోని హవూర్ ప్రాంతంలో నిరసనకారులకు సైన్యం ఎదురుపడటంతో, వాళ్ళు సైన్యం పై రాళ్లు విసిరారు. దానితో సైన్యం కాల్పులు జరుపవలసి వచ్చింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అని పోలీసు అధికారులు తెలిపారు. చనిపోయిన వారిని షకీర్ అహ్మద్ ఖండే (22), ఇర్షాద్ అహ్మద్ (20), అండలీబ్ (16) లుగా గుర్తించారు.
హురియత్ చైర్మన్ మిర్వాయిజ్ ఫరూఖ్ దీనిని ఖండించారు. మరియు దీనిని ఊచకోతగా అభివర్ణించారు. వేర్పాటు వాదులు అసియా ఆండ్రబీని అరెస్టు చేసి ఢిల్లీ తరలించినందుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. ఆమె మీద తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. లోయలో బంద్ ప్రభావం ఎక్కువగానే ఉంది. అధికారులు సయ్యద్ అలీ గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మరియు యాసిన్ మాలిక్ లతో సహా అగ్రశ్రేణి నాయకులందరినీ నిర్బంధించారు.
రేపు ఆదివారం బుర్హాన్ వాని వర్ధంతి కావడంతో లోయలో పోలీసులు, సైన్యం అప్రమత్తమయ్యారు. త్రాల్ అతని స్వస్థలం కావటంతో అక్కడ కర్ఫ్యూ విధించారు.
Post a Comment