ఫ్యాక్షనిస్టు, దోపిడీదారుడు అనేవి వ్యక్తిగత విమర్శలు కావా?

ఫ్యాక్షనిస్టు, దోపిడీదారుడు అనేవి వ్యక్తిగత విమర్శలు కావా?
జగన్ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి తప్పు చేసారు. ఆ తర్వాత కొంతవరకు ప్రతివిమర్శల దాడి జరిగింది. అయినా మీడియా అందరినీ ఇప్పటికీ జగన్ విమర్శల గురించి మీ అభిప్రాయమేమిటి? అని అడుగుతూ, ఉండవల్లి ఏమన్నాడు? నాగ బాబు ఏమన్నాడు? అని చూపిస్తూ ఆ మంటలు చల్లారకుండా తన పాత్ర జాగ్రత్తగా పోషిస్తోంది.

ఆ తర్వాత రోజే పవన్ కూడా జగన్ పై ఫ్యాక్షనిస్టు, దోపిడీదారుడు అంటూ వ్యక్తిగత విమర్శలు చేసారు. ఇలా విమర్శలు చేయటమే కాకుండా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దంటూ నీతులు కూడా చెప్పాడు. ఈ విషయంలో కూడా చంద్రబాబే ఆదర్శమేమో మరి. 

ప్రజల సమస్యలు పక్కకు నెట్టి రెండు ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటానికి పెద్ద ఎత్తున మీడియా కవరేజీ  వస్తుండటం కూడా ఆలోచించవలసిన విషయమే. ఎన్నికలు అంత దగ్గరలో ఏమీ లేవు. తెలంగాణలో అయితే అసలు రాజకీయ వేడి పెద్దగా కనిపించటం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సన్నాహాలు, వ్యూహ ప్రతివ్యూహాలు మొదలయ్యాయి.  

0/Post a Comment/Comments