'2013 భూ సేకరణ చట్ట పరిరక్షణ' కోసం ఏర్పాటు చేసిన సదస్సులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని పేరుతో అడ్డగోలుగా భూములను దోపిడీ చేసారని అన్నారు. చంద్రబాబు తనతో 1850 ఎకరాల్లోనే రాజధాని అని చెప్పి, లక్ష ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. అడ్డగోలుగా భూములను దోపిడీ చేస్తారా? అడిగేవారు లేరనుకున్నారా? తోలు తీస్తామని చంద్రబాబును పవన్ హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రాజు కాదు. ఆయన ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నాకు కూర్చుంటామని పవన్ అన్నారు. అధికారులకు కూడా ముఖ్యమంత్రి చెప్పారని ఏది పడితే అది చెయ్యొద్దని తెలిపారు.
రాష్ట్రంలో అసలు పర్యావరణాన్ని పట్టించుకోవట్లేదని పచ్చని, పొలాలను రాజధాని కోసం తీసుకున్నారని, గోదావరి జిల్లాలో నదీజలాలు కూడా కలుషితమయ్యాయని పవన్ అన్నారు. ఓ ఎమ్మెల్యే, మహిళా అధికారిణి పై చేయి చేసుకున్నా చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
ఇలా మొత్తానికి నిన్న చింతమనేని ప్రభాకర్, పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే, 2015 లో జరిగిన వనజాక్షి ఘటనపై పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Post a Comment