సినీ నటి అన్నపూర్ణ కుమార్తె కీర్తి (23) ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని ఫ్లాట్లో అనుమానాస్పద రీతిలో ఉరివేసుకుని చనిపోయారు. ఆమె భర్త, తాను ఉదయం లేచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.
మృతురాలికి మూడు సంవత్సరాల క్రితమే వివాహమైంది. ఆమె భర్త వెంకట కృష్ణ బెంగళూరు లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆయన కథనం ప్రకారం శుక్రవారం అక్కడ ఆఫీసు ముగిసిన అనంతరం రాత్రి రెండు గంటలకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని కృష్ణా బ్లాక్‌లో ఉన్న తమ ఫ్లాట్ కు చేరుకున్నారు. ఆ సమయంలో కీర్తి నిద్రపోతుండటంతో ఆయన పక్క గదిలో పడుకొన్నారు. ఉదయం లేచి చూసేసరికి ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే పక్కనే గోదావరి బ్లాక్ లో నివాసం ఉండే ఆమె తల్లిగారైన అన్నపూర్ణకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. గత కొంత కాలంగా ఆమె ఆరోగ్యం బాగాలేదని కూడా ఆయన తెలియచేసారు.
Post a Comment