తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ విరుచుకపడ్డారు. బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు కాబట్టే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తానని, అలా అని గుండాలు, ఫ్యాక్షనిస్టులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోనని ఆయన అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను చూడటానికి మెత్తగా కనిపిస్తానని, తేడా వస్తే మాత్రం తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్లకే ఇంత తెగింపు ఉంటే, నిజాయితీగా ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాకెంత తెగింపు ఉండాలి. అని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో మార్పు కోసమే తాను ప్రయత్నిస్తున్నానని, అందుకే తెలుగు దేశం, జగన్, బీజేపీ నేతలు అందరూ తనపై విమర్శలు చేస్తున్నారని పవన్ అన్నారు. తను ఒంటిస్తంభం మేడ పైన కూర్చొనే వ్యక్తిని కాదనీ, నేల పైన నడిచే వ్యక్తినని అన్నారు. రాజ్యాంగాన్ని చంద్రబాబు, జగన్ లు రాయలేదని, అంబేద్కర్ రాసారని గుర్తుంచుకోవాలని వారికి హితబోధ చేసారు.
జగన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఇంతకు ముందే జనసేన పార్టీ తరపున ఆ పార్టీ ప్రదాన కార్యదర్శి మాదాసు గంగాధరం ఖండించారు. జగన్ కు సహనం ఉండాలని, హుందాగా వ్యవహరించాలని, వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సూచించారు.
Post a Comment