హార్దిక్ పటేల్ కు రెండేళ్ల జైలుశిక్ష

హార్దిక్ పటేల్ కు రెండేళ్ల జైలుశిక్ష

బుధవారం గుజరాత్ లోని న్యాయస్థానం, పటీదార్ అనామత్ అందోళన్ సమితి నాయకుడు హార్దిక్ పటేల్ మరియు అతని సహచరులు లాల్జీ పటేల్ మరియు ఎ.కె. పటేల్లకు ఒక అల్లర్ల కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

వీరికి  2015, జూలై 23న బిజెపి శాసనసభ్యుడు రిషికేష్ పటేల్ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఈ శిక్ష ఖరారైంది. ఈ దాడిలో వారు చట్టవిరుద్ధమైన అల్లర్ల కు పాల్పడి ఆస్తికి నష్టం కలిగించారని కోర్టు తేల్చింది. ఈ ముగ్గురికీ రెండేళ్ల జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికీ 50 వేల రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. హై కోర్టులో అప్పీలు చేసుకోవటానికి వీలుగా ఒక నెల సమయమిస్తూ బెయిలు మంజూరు చేసింది. 

హార్థిక్ నాయకత్వంలో 500 మంది తో కూడిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై హార్థిక్ మరియు 18 మంది ఇతరులపై కేసు నమోదయింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post