ఈ సారి పవన్ కళ్యాణ్ హీరో బాలకృష్ణను పరోక్షంగా విమర్శించారు. ఇంట్లో తుపాకీ కాల్చిన వారిని వదిలేసి, జన సేన కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు.
పర్యటనలో కాలు బెణకటంతో, భీమవరంలో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయనను కలిసేందుకు వస్తున్నారు. వారిలో ఒకరు బైక్ సైలెన్సర్ తీసేసి నడిపినందుకు జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని పవన్ కు తెలుపగా, ఆయన జనసేన పార్టీ కార్యకర్తలు బైక్ సైలెన్సర్ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని, ఇంట్లో తుపాకీ కాల్చిన వారిని వదిలేసారని అన్నారు. జన సైనికుల సంస్కారం గొప్పదని ఆయన తెలియచేసారు. గోదావరి జిల్లాల్లోనే జనసేనకు బలం ఉందని కొందరు అంటారని, ఉత్తరాంధ్ర పర్యటన ద్వారా తమ బలం ఏమిటో ఇప్పటికే చూపించామని ఆయన వ్యాఖ్యానించారు.
అయినా బైక్ సైలెన్సర్ తీసిన వారిని సమర్థించటం ఏమిటో, శబ్ద కాలుష్యం గురించి వారికి వివరించి ఒప్పించవచ్చు కదా. ఏదైనా విషయంలో న్యాయం జరగకపోతే రాజకీయ నాయకుడైన పవన్ పోరాడవచ్చు. కానీ వారిని వదిలేసారు మమ్మల్ని వదిలేయండి అనటం ఏమిటో.
Post a Comment