వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్ష్యుడు జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ నుండి జగన్ పారిపోయాడు అని పవన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విమర్శల దాడి జరిగింది.
ఇవాళ పవన్ కల్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతుంటే మనం వినాల్సి రావటం మన ఖర్మ అని అన్నారు. ఇదే వ్యక్తి చంద్రబాబుతోనూ, మోడీతోనూ నాలుగేళ్లు కలిసి కాపురం చేసాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి ఆయన పతివ్రత అని చెపితే మనం నమ్మాలట, నేను తప్పు చేసానట. అని వ్యగ్యంగా అన్నారు.
ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని పొడిచేసి, ఇప్పుడు అందరూ డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తాడు. నేను మోసం చేశానని ఒకరంటారు. మిగతా ఇద్దరూ ఒప్పుకున్నాకే రాష్ట్రాన్ని పొడిచేశానని ఇంకొకరంటారు. లేదు లేదు మిగతా ఇద్దరూ కలసి నన్ను మోసం చేసారని మూడో ఆయన అంటాడు. ఈ నాలుగేళ్లలో ఆరునెల్లకోసారి బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూనో, ట్వీటో ఇస్తాడు. అది కూడా చంద్రబాబుని రక్షించటానికే బయటకు వచ్చాడు. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సి రావటం మన ఖర్మ అని అన్నారు.
ఇంకా ఈ వ్యక్తి విలువల గురించి మాట్లాడతాడు అంటూ వ్యక్తిగత విమర్శలు చేసారు. కారును మార్చినట్టు నాలుగయిదు ఏళ్ళకొకసారి పెళ్ళాల్ని మారుస్తాడు. ఇది పాలిగామీ కాదా?, పైగా ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీలుడినన్నట్లు మాట్లాడుతాడు. అంటూ ముగించారు.
Post a Comment