తెలంగాణలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలకు, ప్రభుత్వం కెసిఆర్ చిత్రంతో ఉన్న గులాబీ రంగు స్కూలు బ్యాగులను కేసీఆర్ బ్యాగుల పేరిట పంపిణీ చేస్తున్నది. అయితే ఈ స్కూలు బ్యాగులు ఇప్పటికే కొనసాగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి.
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాంలు, స్కూలు బ్యాగులు, కాస్మెటిక్ కిట్లు, టై , పెన్నులు, పెన్సిల్స్, పుస్తకాలు, మంచాలు, పరుపులు మరియు తరగతిగదిలో బెంచీలను సరఫరా చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మరియు శారీరక వికలాంగుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రభుత్వం కేవలం యూనిఫాంలను మాత్రమే అందించి కాస్మెటిక్స్ కోసం ప్రతి నెలా కొంత మొత్తాన్ని అందించాలని నిర్ణయించింది. జనరల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈ మాత్రం సౌకర్యాలు కూడా ఉండటం లేదు.
అన్ని వర్గాల రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలకు ఒకే తరహా సౌకర్యాలు కల్పించాలని గత కొంత కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాస్మెటిక్ కిట్లు ప్రారంభించినప్పుడే ఈ తరహా డిమాండ్లు రాగా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆహారం విషయంలో మాత్రం అన్ని పాఠశాలకు ఒకే తరహా మెనూ అమలవుతుంది. అసలు డబ్బులు గానీ, ఏ ఇతర అవకాశాలు గానీ లేనివారే ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారని ఈ వివక్ష మంచిది కాదని విమర్శలు వస్తున్నాయి.
Post a Comment