రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ జరిపితే తీవ్ర పరిణామాలుంటాయని జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ బిల్లుల పెంపు విషయంలో బషీర్ బాగ్ వద్ద ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన హితబోధ చేసారు.
తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో భూమిని ఇచ్చిన, ఇవ్వని రైతులతో మాట్లాడాడు. తమ విలువైన భూమిని కోల్పోయిన రైతుల సమస్యలను నేను గ్రహించగలను. నేను రైతులకు మద్దతు ఇస్తాను, భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవటాన్ని జనసేన వ్యతిరేకిస్తుంది, అవసరమైతే ఉద్యమాన్ని చేస్తుంది. నేను ముందుండి నడిపిస్తాను. అని ఆయన అన్నారు. మేము మా పొలాల్లోకి వెళ్ళడానికి ఆధార్ కార్డులని చూపించవలసి వస్తుందని సేకరణలో భూమిని ఇవ్వని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వాధికారులు బెదిరిస్తున్నారని, ప్రభుత్వమే పంటలను నాశనం చేయిస్తుందని ఆరోపించారు.
Post a Comment