ప్రత్యేక హైకోర్టు బంతి ఇప్పుడు ఏపీ కోర్టులో

ప్రత్యేక హైకోర్టు బంతి ఇప్పుడు ఏపీ కోర్టులో
ఆంధ్రప్రదేశ్ లో హై కోర్టును ఏర్పాటు చేయటానికి అవసరమైన భవనాలను మరియు ఇతర మౌలిక వసతులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. రాష్ట్రం ఇవన్నీ కల్పిస్తే తాము ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. 

తాము ఇప్పటికే అవసరమైన ఆర్థిక సహకారం అందించామని, ప్రత్యేక హైకోర్టు జాప్యం కావటంలో తమ పాత్ర ఏమీ లేదని కూడా తెలిపింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఉమ్మడి హైకోర్టులే నిర్ణయం తీసుకోవలసి ఉందని స్పష్టం చేసింది. 

ఇప్పుడు ప్రత్యేక హై కోర్టును ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆంధ్ర ప్రదేశ్ పైనే పడింది. అయితే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు నిర్దిష్ట గడువేమీ లేదని, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని పేర్కొనడం కొంత ఊరట. 

0/Post a Comment/Comments

Previous Post Next Post