ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, పసువుల లంక సమీపంలో గోదావరి నదిలో 30 మందికి పైగా ప్రయాణీకులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. వీరిలో ఇరవై రెండు మంది వ్యక్తులను రక్షించగా, ఆరుగురు గల్లంతయ్యారు, మరో ఇద్దరు మృతి చెందారు. ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులే కావటం గమనార్హం.
ఈ పడవ పసువుల లంక నుండి సలాద్రి వారి పాలెం వెళ్తుండగా, నిర్మాణంలో ఉన్న ఓక వంతెన స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుండి వచ్చిన NDRF దళాలు మరియు నావికా దళాలు గల్లంతైన వారికోసం గాలిస్తున్నాయి.
శనివారం సెలవుదినమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విద్యార్థులను కోరడంతో వారు వచ్చి వెళ్తుండగా సాయంత్రం ఐదు గంటలకు ఈ ఘటన జరిగింది. చనిపోయిన /గల్లంతయిన వారంతా సలాద్రి వారి పాలెం మరియు సెరిలంక ద్వీప వాసులు. వారి ద్వీపాలకు ప్రధాన భూభాగానికి మధ్య వంతెన గత ఆరు సంవత్సరాలుగా నిర్మాణంలోనే ఉంది. వారికి పాఠశాలకు వెళ్లిరావటానికి, ఇతర పనులకు పడవలే దిక్కు. ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా పడవ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు లేవనే విమర్శలున్నాయి.
Post a Comment