LCA తేజస్ ధరలపై రక్షణ శాఖ సమీక్ష

LCA తేజస్ ధరలపై రక్షణ శాఖ సమీక్ష
భారత రక్షణ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసిన  సైనిక, రక్షణ ఉత్పత్తుల ధరలను నిర్ణయించటానికి కమిటీని నియమించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేసారు. 

ఈ కమిటీ ముందుగా హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసిన దేశవాళీ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (LCA) తేజాస్ ధరలను సమీక్హించనుంది. తేజస్ విమానానికి HAL అడుగుతున్న ధర, విదేశాల నుండి దిగుమతి చేసుకున్న అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ధరల కంటే ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మనదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న అనేక ఆధునిక రక్షణ ఉత్పత్తులు, విదేశాల నుండి దిగుమతి చేసుకునేవాటికన్నా చాల ఎక్కువ ఖరీదుతో ఉంటున్నాయి. మేము అసలు ఈ ధరలు అంతలా ఎందుకు పెరుగుతున్నాయి చూడాలనుకుంటున్నాము అని రక్షణ మంత్రి అన్నారు. మంత్రిత్వ శాఖలోని  డైరెక్టర్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు.

భారత వైమానిక దళం (IAF), ఇప్పటికే LCA తేజస్ ధరలను సమీక్షించాలని అభ్యర్థించింది. తేజస్ Mk-1A విమానం కోసం HAL 463 కోట్లను అడుగుతోంది. కానీ మన దేశంలోనే తయారవుతున్న అధునాతన జంట ఇంజిన్ సుఖోయ్-30 ధర 400 కోట్లు మాత్రమే.  దిగుమతి చేసుకున్న సుఖోయ్-30 ధర 300 కోట్లకు లోపుగానే ఉంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post