ఆంధ్ర ప్రదేశ్ లో ఉండి ఫైబర్ గ్రిడ్ ద్వారా అనుసంధానమైన కేబుల్ కనెక్షన్ ఉపయోగించేవారు, టీవీ స్టార్ట్ చేసిన తర్వాత ఐదు నిమిషాలపాటు చంద్రబాబు, లోకేష్ల ప్రసంగాలే చూడవలసి వస్తుందని, ఆ తర్వాత మాత్రమే వేరే కార్యక్రమాలు చూడటం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు.
ఈ ప్రతినిధులు, కొత్తగా విధించిన పోల్ పన్నుపై ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్ష్యుడు జగన్ మోహన్ రెడ్డికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేబుల్ ఆపరేటర్లకు పోల్ పన్ను మినహాయింపు ఇస్తామని, కొత్త ఫైబర్ గ్రిడ్ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క పోల్ ను వాడినందుకు 50 రూపాయల పన్నును ఖరారు చేసింది. ఆపరేటర్లు ఈ పన్నును విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వం మొత్తం కేబుల్ వ్యవస్థను తన చేతిలోకి తీసుకుని, ఏం ప్రసారం చేయాలో నియంత్రించాలని భావిస్తోంది. అందుకే ఫైబర్ గ్రిడ్ లో చేరని ఆపరేటర్లను వేధింపులకు గురి చేయటానికే ఈ పన్నును తెరపైకి తెచ్చిందని జగన్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం పెద్ద కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగేలా మరియు చిన్న ఆపరేటర్లకు నష్టం కలిగేలా వ్యవహరిస్తోందని, తాను ఈ విధానాన్ని మార్చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
Post a Comment