మెట్రో ఎండీ పదవీకాలం పొడగింపు

మెట్రో ఎండీ పదవీకాలం పొడగింపు
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించింది.  అతని పదవీ కాలాన్ని 2019 జూన్ 30 వరకు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ శనివారం జీవో విడుదల చేసారు. 

అమీర్‌పేట్ నుంచి ఎల్బీనగర్ (16 కిలోమీటర్లు), అమీర్‌పేట్ నుంచి హైటెక్‌సిటీ (10 కి.మీ), జేబీఎస్- ఎంజీబీఎస్ (10 కి.మీ) వంటి మార్గాలు పూర్తయ్యే దశలో ఉండటం,  ఎయిర్ పోర్టు మెట్రో డిపిఆర్ సిద్ధమవుతుండటంతో ఆయనకు ఈ పొడగింపు లభించింది. ఆయన పదవీకాలం పొడగింపబడటం ఇది మూడవసారి.  

0/Post a Comment/Comments

Previous Post Next Post