కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ లో, కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల సామర్థ్యం గల 7 వ దశలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు దీనిని స్విచ్ ఆన్ చేసి పవర్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ వేడుకలో బీహెచ్‌ఈఎల్ ఈడీ ముఖోపాధ్యాయ, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జెన్‌కో డైరెక్టర్లు వెంకటరాజం, సదానందం మరియు ప్లాంట్ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
దేశంలోనే శరవేగంగా నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు
- దేశంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిచటానికి కనీస సమయం 48 నెలలు కాగా ఈ ప్లాంటు 40 నెలల్లోనే అందుబాటులోకి వచ్చింది.
- ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టు
- త్వరగా పూర్తి చేయటం వలన తక్కువ ధరకు విద్యుత్, దాదాపు 300 కోట్ల రూపాయల ఆదా
Post a Comment