66 సంవత్సరాలుగా పెంచిన గోళ్లు.... ఇప్పుడు మ్యూజియంలో

66 సంవత్సరాలుగా పెంచిన గోళ్లు.... ఇప్పుడు మ్యూజియంలో
మన దేశానికి చెందిన శ్రీధర్ ఛిల్లల్,  అత్యంత పొడవైన గోళ్లతో ప్రపంచ రికార్డును సృష్టించిన వ్యక్తి. ఆయన వయసు 82 సంవత్సరాలు.  ఆయన గత 66 సంవత్సరాలుగా అంటే 1952 నుండి తన ఎడమచేతి గోళ్లు కత్తిరించుకోలేదు.

న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్లో రిప్లీస్ సంస్థ బుధవారం రోజు ఆయన గోళ్లు కత్తిరించటానికి ప్రత్యేకంగా 'నెయిల్ క్లిప్పింగ్ సెర్మనీ' నిర్వహించింది. ఆ సంస్థ తమ 'బిలీవిట్ ఆర్ నాట్' మ్యూజియం లో ఈ గోళ్లను ప్రదర్శనకు ఉంచనుంది. ఈ సంస్థ కు ప్రపంచవ్యాప్తంగా 20 ప్రదర్శన శాలలు ఉన్నాయి. ఇప్పటి వరకు నమ్మశక్యం కాని ఇలాంటి 500 వస్తువులను సేకరించింది.

ఈ గోళ్లను  2016 లో గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్, ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లుగా గుర్తించింది. శ్రీధర్ ఛిల్లల్ బొటనవేలు గోరు పొడవు  197.8 సెంటీ మీటర్లు కాగా, మొత్తం గోళ్ల పొడవు 909.6 సెంటిమీటర్లు.

1952 లో ఆయన చేసిన పొరపాటు వల్ల ఆయన టీచర్ గోరు తెగిపోవడంతో నువ్వెప్పటికీ వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేవు. ఎందుకంటే నువ్వు దేనికి కట్టుబడి ఉండవు అని మందలించాడట. ఆ పంతం తోనే పెంచటం ప్రారంభించిన గోళ్లు ఇప్పటివరకు కట్ చేసుకోలేదు.

ఆయన ఎడమ చేతి గోళ్లు మాత్రమే పెంచాడు. కుడి చేతి గోళ్లు మామూలుగానే కత్తిరించుకునేవాడు. గోళ్ళ బరువుకి ఎడమ చేయి శాశ్వతంగా పని చేయటం మానేసి కొన్ని సంవత్సరాలవుతుంది. గోళ్లు అతని సాధారణ జీవితానికి ఎటువంటి అడ్డంకి కాలేదు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post