టీవీ ఛానెళ్ల పైనా కేసులు పెట్టండి

టీవీ ఛానెళ్ల పైనా కేసులు పెట్టండి
తెలంగాణాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులకు సూచించింది. ఈ మధ్యే కత్తి మహేష్, పరిపూర్ణానంద స్వామి లపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నగరం నుండి బహిష్కరించారు. ఈ ఉదంతంలో టీవీ9 కు కూడా నోటీసులు అందజేశారు. అవసరమైతే టీవీ చానెళ్ల పైన కూడా అవే కేసులు ఫైల్ చేయాలని ప్రభుత్వం  పోలీసులకు తెలియజేసింది. 

టీవీ చానెళ్లకు కూడా, సున్నితమైన విషయాలపై రాద్ధాంతం చేయవద్దని, పదే పదే అటువంటి విషయాలు ప్రసారం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. 

ఈ బహిష్కరణలపై తెలంగాణ పోలీసులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కొన్ని విషయాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరారు. ప్రభుత్వం తాము జోక్యం చేసుకోమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలకు కూడా వెనకాడవద్దని విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

0/Post a Comment/Comments