నేను పార్టీ మారడం లేదు : ముఖేష్ గౌడ్

నేను పార్టీ మారడం లేదు : ముఖేష్ గౌడ్
గత రెండు రోజులుగా పార్టీ  మారబోతున్నాడంటూ పత్రికలలో వచ్చిన వార్తలపై మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముఖేశ్‌గౌడ్‌ ఇవాళ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేసారు. 

ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా జాంబాగ్ లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, అనుచరులతో సమావేశమై, చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌లో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగడం లేదని, అనేక మంది బీసీ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారని, తాను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ముఖేష్‌గౌడ్‌ తెలిపారు 

ముఖేశ్ గౌడ్ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, వి హనుమంతరావు కూడా పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ రాజకీయాలలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన కొంతకాలం గా గాంధీ భవన్ లో జరిగిన పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post