తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బోనాల ఉత్సవాలు జూలై 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా జంటనగరాల ప్రజలు భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఘటోత్సవం, కొలుపు, పోతురాజు, బలి , రంగం మరియు సాగనంపడం ఈ జాతరలో ముఖ్యాంశాలు.
2018 బోనాలు పండుగ తేదీలు
జులై 15 - లంగర్ హౌజ్ నుంచి ఊరేగింపు ప్రారంభం
జులై 22, 23 - గోల్కొండ మహంకాళి బోనాల జాతర
జులై 29,30 - సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర (29న కొలుపులు, జాతర - 30న రంగం), బల్కంపేట ఎల్లమ్మ జాతర
ఆగష్టు 5 - పాత నగరం బోనాల జాతర
(లాల్ దర్వాజా సింహవాహిని, చిలకలగూడ మైసమ్మ, హరిబౌలి అక్కన్న మాదన్న, శాలిబండ ముత్యాలమ్మ )
ఇంకా జంట నగరాల్లో అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుపుకుంటారు.
Post a Comment