అన్నా క్యాంటీన్లలో అన్నం లేదు... బాబు పాలనలో ఉద్యోగాలు లేవు

బాబు పాలనలో ఉద్యోగాలు లేవు
బిజెపి, టిడిపి కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేసాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన ఆ రెండు పార్టీలు చేసిన మోసాలకు ప్రజలే తగిన బుద్ధి చెపుతారని, జగన్ ఒక్కడే ప్రత్యేక హోదా కోసం తొలి నుండి ఒకే విధానం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. 

మోడీ పాలనలో ఎటిఎంలలో డబ్బులు లేవు, బాబు పాలనలో ఉద్యోగాలు లేవు, కొత్తగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో అన్నం ఉండటం లేదు అని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో చంద్ర బాబును అరెస్టు చేయక పోవటం ఏంటి? దీనిపై గవర్నర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. 

0/Post a Comment/Comments