జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేసి తన డిమాండ్లలో ఒక దానిని సాధించుకున్నారు. అయితే ఈ విషయంలో తన వర్గం వారి మరియు నియోజక వర్గ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్ర ప్రయోజనాలనే తాకట్టు పెట్టాడనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
చంద్ర బాబు నాయుడు మరియు పార్టీకి చెందిన ఇతర ఎంపీలు దేశవ్యాప్తంగా మద్ధతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, సొంత పార్టీ ఎంపీనే ఓటింగ్ కు దూరంగా ఉంటాననటం పార్టీకి, రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తుందని భావించి ఆయన బ్లాక్ మెయిల్ కు లొంగినట్లు తెలుస్తుంది. జీవో జారీ చేసి ఆయనను బుజ్జగించంతో గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరారు.
తెలుగు దేశం పార్టీలో, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరా తన మాట చెల్లుబాటు కావడం లేదనే జేసీ సమయం చూసి అలక వహించారు. అనంతపురం పాతూరులోని రోడ్ల విస్తరణ, గురునాథరెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చిన ఛైర్మన్ పదవి హామీని చంద్రబాబు నిలబెట్టుకోకపోవటం, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాను పార్టీలో చేర్చుకోకపోవటం వంటి వాటిని సాధించుకోవాలనే ఆయన ఈ సమయంలో మొండికెత్తారు. దానితో చంద్రబాబు దిగివచ్చి రోడ్ల విస్తరణపై ఆఘమేఘాలపై జీవోను జారీ చేసి జేసీని ఢిల్లీ బయలు దేరేలా ఒప్పించగలిగారు. మిగిలిన డిమాండ్లపై కూడా హామీ ఇచ్చినా, పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేల నుండి తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Post a Comment