భారీ తేడాతో వీగిపోయిన అవిశ్వాసం

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ తేడాతో వీగిపోయింది. శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు చర్చ ముగిసిన అనంతరం  స్పీకర్ సుమిత్రా మహాజన్ వోటింగ్ ను నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు ఓటు వేయగా 325 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేసారు. స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని తెలియచేసిన అనంతరం సోమవారం ఉదయం 11 గంటల వరకు సభను వాయిదా వేసింది. 

అవిశ్వాస తీర్మానం పై  ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు చర్చ కొనసాగటం విశేషం. ఈ తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయమై ప్రవేశపెట్టినప్పటికీ, ప్రాంతీయ పార్టీలన్నీ వారి వారి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదాను కొద్దీ సేపు మాత్రమే ప్రస్తావించి, తర్వాత మోడీ ప్రభుత్వ వాగ్దానాల అమలు తీరును, రఫాలే ఒప్పందాన్ని, మరియు మత అసహనాన్ని ప్రస్తావించి ప్రభుత్వ అవినీతిపై విమర్శలు చేసారు. 

పూర్తి స్థాయి ప్రత్యేక హోదా పై చర్చ జరగాలనే తెలుగుదేశం పార్టీ ఉద్దేశ్యం మాత్రం నెరవేరలేదు. కాగా హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అనవసర కాలయాపన చేయవద్దని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కూడా సూచించారు. చంద్రబాబు ఇప్పటికీ తమ మిత్రుడేనని వ్యాఖ్యానించారు. మోడీ ప్రసంగంలో చంద్రబాబు ఒప్పుకున్న తరువాతే ఆంధ్ర ప్రదేశ్ కు ప్యాకెజీని ప్రకటించామని వివరించారు. ముందు ఒప్పుకుని తర్వాత ప్రతిపక్షము చేసిన వత్తిడికి తలొగ్గి మాట మార్చారని అన్నారు. అవిశ్వాస తీర్మానం అనేది ప్రజాస్వామ్యానికి గొప్ప వరమని బలం లేకుండా పెట్టి దీనిని వీరు దుర్వినియోగం చేసారని ప్రధాని విమర్శించారు. 

కాగా లోక్ సభలో ఇది 27వ అవిశ్వాస తీర్మానం. 2003 లో వాజపేయి ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత ఈ పదిహేను సంవత్సరాలలో ఇదే మొదటిది. ఇప్పటి వరకు ఇందిరా గాంధీ అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post