పాకిస్తాన్ లో అడుగు పెట్టగానే జైలుకు తీసుకెళ్తారని తనను తెలుసని నవాజ్ షరీఫ్ అన్నారు. బ్రిటన్ నుండి బయలుదేరిన నవాజ్, మరియమ్ లు మధ్యలో అబుదాబి విమానాశ్రయంలో ఆగిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేసారు.
నన్ను డైరెక్టుగా జైలుకు తీసుకెళ్తారని తెలుసు. పాక్ ప్రజల కోసం నేను ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. ముందు తరాల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసాను. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్ళీ రాదు. పాక్ భవితవ్యాన్ని మనమందరం కలిసి నిర్ణయించాలని పాకిస్తాన్ ప్రజలకు నవాజ్ షరీఫ్ ఆ వీడియో ద్వారా సందేశమిచ్చారు.
నవాజ్ షరీఫ్ కు ఏడు సంవత్సరాలు, ఆయన కుమార్తె మరియమ్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. వారు ఈ సాయంత్రం పాకిస్తాన్ చేరుకోనున్నారు. విమానాశ్రయంలోనే ఆయనను అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేసారు.
نواز شریف نے اپنا فرض نبھا دیا۔ اب آپ کی باری ہے ! pic.twitter.com/TqG2evM0wn— Maryam Nawaz Sharif (@MaryamNSharif) July 13, 2018
Move like a hero , live like a lion #NawazSharif and @MaryamNSharif move in Abu Dhabi airport for EY243 pic.twitter.com/2D1QJxGM6J— Saima Farooq (@SaimaFarooq) July 13, 2018
Post a Comment