కిరణ్ తిరిగి కాంగ్రెస్ గూటికి

కిరణ్ తిరిగి కాంగ్రెస్ గూటికి
ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని న్యూఢిల్లీలో కలిసిన అనంతరం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో తన కుంటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు వచ్చిన గుర్తింపు అంతా కాంగ్రెస్ పార్టీ వలననే లభించిందని వ్యాఖ్యానించారు. 

కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఆయన 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజనను  వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేసారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగదు. విభజన చట్టాన్ని అమలు చేయటంలో ఇప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి ఊమెన్ చాందీ, కిరణ్ రాకను స్వాగతించారు. మిగిలిన నేతలంతా కూడా కాంగ్రెస్ గూటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post