ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేసారు. శనివారం ఉదయం తన నివాసంలో హోంశాఖ ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఆర్పీ ఠాకూర్ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 1961 జులై 1న జన్మించిన ఆర్పీ ఠాకూర్ ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఐపీఎస్‌కి ఎంపికయ్యారు. ఆయన పూర్తి రామ్ ప్రవేశ్ ఠాకూర్. ఆయన రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించి సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. పదవీవిరమణ చేసిన డీజీపీ మాలకొండయ్యకు ఘనంగా వీడ్కోలు పరేడ్ నిర్వహించారు.
Post a Comment