జాక్ మా ను అధిగమించిన ముఖేష్ అంబానీ

జాక్ మా ను అధిగమించిన ముఖేష్ అంబానీ
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శుక్రవారం రోజు ఆసియా లోనే  ధనవంతుడు, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను ముఖేష్ వ్యక్తిగత సంపదలో అధిగమించారు. 

ఇదే కాకుండా రిలయన్స్ సంస్థ 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను సాధించింది. 7 లక్షల కోట్ల మార్కెట్ విలువను కూడా అధిగమించింది. మన దేశంలో టిసిఎస్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ కంపెనీ ఇదే. 

శుక్రవారం స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్ ఒక దశలో 1,106.65 రూపాయలకు చేరినా చివరకు 1,101 రూపాయలకు ముగిసింది. దీనితో కంపెనీలో 44.5 శాతం వాటా ఉన్న ముఖేష్ నికర విలువ 44.3 బిలియన్ డాలర్లకు చేరింది. జాక్ మా సంపద 44 బిలియన్ డాలర్లు. జాక్ మా ఈ సంవత్సరంలో 1.4 బిలియన్ డాలర్లు నష్టపోగా, ముఖేష్ ఏకంగా 4 బిలియన్ డాలర్లు సంపాదించాడు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post