నువ్వు ప్రపంచ కోర్టుకు వెళ్లినా అంతే

నువ్వు ప్రపంచ కోర్టుకు వెళ్లినా అంతే
శుక్రవారం జగిత్యాలలో తెలుగు దేశం తెలంగాణ అద్యక్ష్యుడు రమణ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేస్తే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలని, రాజ్యాంగానికి లోబడి పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.

బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి సుప్రీం కోర్టుకు వెళతాననటం పై వ్యాఖ్యానిస్తూ ఇది హాస్యాస్పదంగా ఉందని, ప్రపంచ కోర్టుకు వెళ్లినా కేసీఆర్‌ అనుకున్నట్లు రిజర్వేషన్లు అమలు కావని ఎద్దేవా చేసారు.

యాభయి నెలల టిఆర్ఎస్ పాలనలో నలుబది రెండు సార్లు ప్రభుత్వ  నిర్ణయాలపై కోర్టుకు ఫిర్యాదులు వెళ్లాయని, కోర్టు ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వం వైఖరి మార్చుకోవడం లేదన్నారు. అందరు ముఖ్యమంత్రులు సెక్రటేరియట్ నుండి పాలిస్తే, కేసీఆర్‌ మాత్రం ఫాంహౌజ్‌, ప్రగతి భవన్‌ నుండి పాలిస్తున్నారని రమణ విమర్శించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post