పార్లమెంట్లో అఖిల పక్ష సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా బుట్టా రేణుకను పిలవటంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన కారణంగా ఆమెపై రెండున్నర సంవత్సరాల క్రితమే అనర్హత పిటిషన్ దాఖలు చేసామని, దానిపై నిర్ణయం తీసుకోకపోగా, ఇలా చేయటమేమిటని ప్రశ్నించారు. కాగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయటంతో లోక్ సభలో ఈ పార్టీకి ప్రాతినిధ్యం లేదు.
అఖిల పక్షానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ విషయమై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ను నిలదీసారు. ఫిరాయించిన ఎంపీని సమావేశానికి పిలవటం పద్దతి కాదని, తక్షణమే ఆమె నేమ్ ప్లేట్ తొలగించాలని ఆయన డిమాండ్ చేసారు. లేకపోతే సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. మిగిలిన పక్షాలు కూడా ఆయనకు మద్ధతు తెలపటంతో బుట్టా రేణుక నేమ్ ప్లేట్ ను తొలగించారని ఆయన తెలియచేసారు. ఇది టిడిపి - బిజెపిల కుట్ర అని విజయసాయి రెడ్డి అభివర్ణించారు.
Post a Comment