రేపు రాత్రి ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని రేపు పౌర్ణమి రోజు ఆకాశంలో వీక్షించవచ్చు. మొత్తం దాదాపు ఆరు గంటల పాటు ఉండే ఈ గ్రహణంలో బ్లడ్ మూన్ దర్శమివ్వనుంది. సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు 100 నిమిషాలకు పైగా ఎరుపు రంగులో (బ్లడ్ మూన్) కనిపించనున్నాడు. పౌర్ణమి రోజు అంగారక గ్రహం కూడా ఆకాశంలో ఎప్పుడూ కనిపించనంత పెద్దగా కనిపించనుంది. మళ్ళీ ఈ స్థాయి చంద్రగ్రహణం 2123 లో ఉంది.
హైదరాబాద్ లో ఈ గ్రహణం దాదాపు నాలుగు గంటల సమయం పాటు కనిపించనుంది.
హైదరాబాద్ లో
ప్రారంభ సమయం ( 27th, July) 23:54:26
ముగిసే సమయం ( 28th, July) 03:48:59
మొత్తం గ్రహణ సమయం - 03 గంటల 54 నిమిషాల 33 సెకన్లు
అన్ని ప్రాంతాలను కలిపి చూసుకుంటే గ్రహణం 10.44 కు మొదలై ఉదయం 4.58 నిముషాలకు ముగియనుంది. తెల్లవారు జామున ఒంటిగంట నుండి 2 గంటల 43 నిముషాల మధ్యలో బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది.
ఈ చంద్ర గ్రహణం ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా మరియు దక్షిణ అమెరికాలలో కనిపించనుంది. ఉత్తర అమెరికా మరియు కెనడాలలో ఈ గ్రహణం లేదు.
Lunar Eclipse on 27th July Image Credit : NASA - Press Association |
Post a Comment