పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన నగర దర్శిని సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రం సహకరించకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అండగా ఉంటామని చెప్పినందుకే ఎన్డీయే లో చేరామని కానీ కేంద్రం మోసం చేసిందని తెలిపారు. తాను కష్టపడుతుంటే జగన్, పవన్లు కేంద్రం తో చేరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని స్థాయి వ్యక్తులే ఇచ్చిన మాట తప్పి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, అయినా భయపడేది లేదని ప్రత్యేక హోదా ఇచ్చేవరకు వారిని వదిలేది లేదని అన్నారు.
కేసుల భయంతోనే జగన్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడని చంద్రబాబు అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బోనులో నిలబడే వ్యక్తి నన్ను విమర్శిస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసిపి ఎంపీలు లాలూచీ పడి రాజీనామా చేసి ఇంట్లో పడుకుంటే తెలుగు దేశం ఎంపీలు కేంద్రంపై పోరాడుతున్నారని ఆయన అన్నారు.
తనపై నమ్మకంతో రైతులు భూములు ఇస్తే, కొంతమంది వారిని రెచ్చ గొట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కొత్త పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, ఏ పార్టీ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందో తెలుసుకోవాలని ప్రజలను కోరారు.
Post a Comment