లోకేష్ ఇంత తొందరగా అభ్యర్థులను ప్రకటించడం తనను షాక్‌కు గురి చేసిందని టీజీ వెంకటేశ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు కూడా కాని వ్యక్తి అలా ఎలా ప్రకటిస్తారు. పైగా అది ప్రభుత్వ కార్యక్రమం. బీఫాం ఇచ్చే ముందు కూడా నిర్ణయాలు మార్చుకునే తెలుగుదేశం పార్టీ, ఎలా అభ్యర్థులను ప్రకటించిందో అంతుచిక్కడం లేదని కూడా అన్నారు. మరి ఎస్వీ మోహన్ రెడ్డి, లోకేష్ ను హిప్నటైజ్ చేశారేమో. మా మోహన్ రెడ్డి ఏమైనా చేయగలడు. అని వ్యాఖ్యానించారు.
టీజీ వ్యాఖ్యలకు మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయనను రాజ్యసభకు పంపినప్పుడే, తనకు కర్నూల్ సీటు ఒప్పందం కుదిరిందని, ఇప్పుడు అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ ను ప్రశ్నించటాన్ని కూడా తప్పు పట్టారు. ఎన్నికలప్పుడే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని అన్నారు. లోకేష్ టిడిపి జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర మంత్రి, ఆయనకు అధిష్టానంతో మాట్లాడి అభ్యర్థులను ప్రకటించే హక్కు ఉంటుంది. అని వెనకేసుకొచ్చారు. తనకూ, టీజీ కి మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని కూడా స్పష్టం చేశారు.
Post a Comment