బాబు వస్తున్నాడని బార్ కు ముసుగు

బాబు వస్తున్నాడని బార్ కు ముసుగు
విజయవాడ ఆర్టీసీ వర్కుషాప్ రోడ్డు లోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారని, అధికారులు  పక్కనే ఉన్న రాగమయి బార్ అండ్ రెస్టారెంట్ కు నేమ్ బోర్డులు కనబడకుండా ముసుగు వేసారు. ఇవాళ మూసేయమని ముందుగానే హెచ్చరించారు కూడా. 

గతంలో జక్కంపూడి లో పర్యటన సందర్భంగా కాలనీ రోడ్డుకు ముందున్న వైన్ షాప్ ని చూసి ముఖ్యమంత్రి వెంటనే మూసేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సారి అలా జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారన్నమాట. 

0/Post a Comment/Comments