లోకేష్ ముందస్తు

లోకేష్ ముందస్తు
ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అప్పుడే రాబోయే ఎన్నికల కోసం టిడిపి అభ్యర్థులను ప్రకటించే పని మొదలుపెట్టేసారు. కర్నూలు ఎంపీ స్థానానికి బుట్టా రేణుక, ఎమ్మెల్యే స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన, వారిద్దరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఇద్దరూ గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. 

ఈ ప్రకటనలతో తెలుగు దేశం పార్టీ లో కలకలం రేగింది. ముందుగా ఫిరాయింపు దార్లను అభ్యర్థులుగా ప్రకటించటం ఏమిటని, ఇంత ఎందుకు తొందరగా ప్రకటించ వలసి వచ్చిందని, ఏ హోదా తో ప్రకటించారని వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్ ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడిది గానీ, జాతీయ అధ్యక్ష్యుడిది గానీ అనుమతి తీసుకున్నారో లేదో తెలియరాలేదు. 

0/Post a Comment/Comments