ఛత్తీస్ గఢ్ నుండి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్ర ప్రజలకు భారంగా మారనుంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఈఆర్సీ, తెలంగాణ పంపిణీ సంస్థలు వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. ఈ నెల ఏడవ తేదీన తుది తీర్పును వెలువరించింది.
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ బోర్డు మార్వా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని 8892.50 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఇందులో పెట్టుబడి వ్యయం 8019. 25 కోట్ల రూపాయలుగా (కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం అయిన జూలై 31, 2016 నాటికి) నిర్ణయించింది. దీని ప్రకారం ఇంధన ఖర్చు చార్జెస్ యూనిట్‌కు 139.3 పైసలు, వేరియబుల్ కాస్ట్ యూనిట్‌కు 232 పైసలుగా ఉంది. ఈ లెక్కన మనం ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించే యూనిట్ ధర 3 రూపాయల 71 పైసలు. ప్రస్తుతం నిర్ణయించిన ధర 2018-19 సంవత్సరం నుంచి 2020-2021 వరకు అమలులో ఉంటుంది.
ఈ ధరలు ఎన్టీపీసీ తో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ , ఇవి కాకుండా ఏటా చెల్లించే ప్రాజెక్ట్ చార్జీలు రాష్ట్రానికి భారం కానున్నాయి. వీటికోసం రాష్ట్రం 2018-19లో ఏకంగా 1602.77 కోట్లు చెల్లించవలసి వస్తుంది. ప్రాజెక్ట్ సరియైన సమయంలో పూర్తికాకపోవటంతో ప్రాజెక్టు వ్యయం, వడ్డీలు కలిసి ఇప్పుడు రాష్ట్రంపై భారాన్ని మోపుతున్నాయి. దేశంలో మెగావాట్ కు సరాసరి నిర్మాణ వ్యయం 6 కోట్లకు తక్కువగానే ఉండగా, ఇక్కడ ఏకంగా 9 కోట్లకు చేరింది.
Post a Comment