బెట్టింగ్ చట్టబద్ధం కానుందా??

బెట్టింగ్ చట్టబద్ధం కానుందా??
బెట్టింగ్ ను నిరోధించడం అసాధ్యమైనందున, వాటిని చట్టబద్ధంగా నియంత్రించడమే మేలని భారతదేశ న్యాయ కమిషన్ నివేదికను సమర్పించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి  జస్టిస్ B.S.చౌహాన్, నేతృత్వంలోని కమిషన్, బెట్టింగ్ ను చట్టబద్దం చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని కూడా పేర్కొంది.  

ఆధార్ కు లింక్

గ్యాంబ్లర్లు మరియు ఆపరేటర్ల మధ్య లావాదేవీలను వారి ఆధార్ మరియు పాన్ కార్డులతో అనుసంధానించాలి, అందువల్ల ప్రభుత్వం వారిని నియంత్రించగలదు. బెట్టింగ్ లో  కేవలం కాష్ లెస్ లావాదేవీలను మాత్రమే అనుమతించి,  ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో పన్ను పరిధిలోకి వచ్చేలా చూడాలి. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం దేశానికి భారీ స్థాయిలో వస్తాయి. అంతే కాకుండా వ్యక్తిగత ఆదాయాలను బట్టి ఎవరిని ఎంతవరకు అనుమతించవచ్చో కూడా ప్రభుత్వమే నిర్ణయించవచ్చు.  అని పానెల్ తెలిపింది. 

లీగల్ ఫ్రేమ్ వర్క్ గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్ బెట్టింగ్ ఇన్ క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా  అనబడే ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరిందని సమాచారం. దీనిపై పార్లమెంట్ లో విస్తృతమైన చర్చ జరగనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 252 ప్రకారం, ఈ సిఫార్సులు అమల్లోకి రావటానికి  రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post