నాగబాబు పై కత్తి విమర్శలు - వీడియో

శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలు ఎదుర్కొంటున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జబర్ధస్త్‌ ఫేం, మెగా బ్రదర్‌ నాగబాబు డిమాండ్‌ చేశారు

నాగబాబు కత్తి మహేష్ తో కొత్తగా వివాదంలో చిక్కుకున్నట్లు అయింది.  శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలు ఎదుర్కొంటున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జబర్ధస్త్‌ ఫేం, మెగా బ్రదర్‌ నాగబాబు డిమాండ్‌ చేశారు.

దీనికి ప్రతిగా కత్తి మహేష్ నాగ బాబు పై విరుచుకపడ్డారు. నాగబాబు నా పేరు కూడా ఉచ్ఛరించకుండా నన్ను నీచుడిగా సంభోదిస్తూ చేసినటువంటి వీడియో నేను చూశాను. నాకు జాలి కలిగింది. నేనా నీచుడినా? అంత నీచానికి ఏం పాల్పడ్డానని ప్రశ్నించారు. ఒక అన్నకు తమ్ముడిగా.. ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నాగురించి మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ రామ భక్తులా.. జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకొని వేరే పార్టీలో కలవడం. జబర్ధస్ట్‌లాంటి షోలో జడ్జ్‌గా కుర్చోని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఉండటం ఇది మీ కాంట్రిబ్యూషన్‌ టు ద సొసైటీ.

మీరు హిందువు.. ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీ ఎంత బాగా పట్టుదలతో ఉంటారనేది మాకందరికీ బాగా తెలుసు. మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం. మీరు నాకు బెదిరింపులు ఇస్తారా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద చేయి పడితే మీరే బాధ్యత వహిస్తారు. నేను చెప్పిందేంటో అర్ధం కానీ మీరు నాకు వార్నింగ్‌ ఇస్తారా, ఇదే పంథా మీరు కొనసాగించండి. మీ రాజకీయ, సినిమా జీవితం ఎంత దౌర్భాగ్యమో అందరికీ వెలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుంది. మీ పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారని అన్నాడు.



Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget