రికార్డు స్థాయికి అమెరికాతో చైనా వాణిజ్య మిగులు

రికార్డు స్థాయికి అమెరికాతో చైనా వాణిజ్య మిగులు
అమెరికాతో చైనా వాణిజ్య మిగులు జూన్ నెలలో రికార్డు స్థాయిలో దాదాపు $ 28.97 బిలియన్లకు చేరుకుంది. మే నెలలో ఈ మిగులు $24.58 బిలియన్లు గా ఉంది. అంటే ఈ నెలలో అమెరికాకు చైనా ఎగుమతులు ఘనణీయమైన స్థాయిలో వృద్ధి చెందాయి. వాషింగ్టన్ కు చైనా తో ఇప్పటికే మొదలైన వాణిజ్య వివాదం మరింతగా ముదిరే అవకాశముంది. మంగళవారం $200 బిలియన్ల చైనా దిగుమతులపైన 10% అదనపు సుంకాలు విధించిన తరువాత ఈ విషయం వెలుగులోకి రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

కాగా జూలై మొదటి వారంలో నుండి అదనపు సుంకాలు అమలులోకి రానున్నాయి. దానితో చాలామంది ముందస్తు దిగుమతులు చేసుకున్నారని అందుకే మిగులులో వృద్ధి ఎక్కువగా కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. జులై నెలలో వాణిజ్య మిగులు తగ్గనుందని భావిస్తున్నామని వారు అన్నారు. 

అమెరికాతో వాణిజ్య పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగనుండటంతో, చైనా ప్రత్యామ్నాయాలను అన్వేషించటం ప్రారంభించింది. ఆసియా దేశాల దిగుమతులపై సుంకాలను భారీగా తగ్గించింది. ఇతర దేశాలతో వాణిజ్యం మెరుగు పరుచుకునే చర్యలలో భాగంగానే ఇప్పటివరకు దిగుమతులకు అనుమతించని మనదేశ కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులకు తలుపులు తెరిచింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post