కోకిలా వ్రతం

కోకిలా వ్రతం
కోకిలా వ్రతాన్ని ఆషాఢ పౌర్ణమి రోజు ప్రారంభించి శ్రావణ పౌర్ణమి రోజున ముగిస్తారు. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో ఈ వ్రతం అధిక ఆషాఢం వచ్చినప్పుడు మాత్రమే జరుపుకోవాలనే నిబంధన ఉండగా, దక్షిణ మరియు పశ్చిమ భారత దేశములో ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. 

కోకిలా వ్రతాన్ని మొదట పార్వతీ దేవి, శివున్ని భర్తగా పొందటానికి చేసినట్లుగా భావిస్తారు.  ఈ వ్రత సందర్బంగా సతీ దేవిని మరియు శివుడిని ఆరాధిస్తారు. ఈ వ్రతానికి సంబంధించిన కథ ప్రకారం దక్షుడు శివుడిని అవమానించినప్పుడు సతీదేవి తనలో తాను దహనమైపోతుంది. అలా మరణించిన ఆమె కోయిల రూపంలో పది వేల సంవత్సరాలు గడిపిన తర్వాతనే పార్వతిగా జన్మించి శివున్ని వివాహం చేసుకొంది. 

కోకిలా వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఉదయమే నిద్రలేచి సమీపంలోని నది /నీటి వనరు దగ్గరకు వెళ్లి స్నానమాచరించి అక్కడే ఇసుకతో కోకిలను తయారు చేసి దానిని పూజిస్తారు. వ్రతంలో భాగంగా  ఉపవాస మాచరించాలి.  మరియు నేలపైనే నిద్రించాలి.  సకల ప్రాణులపైన దయ కలిగి ఉండాలి.

ఈ వ్రతమాచరించే స్త్రీలు అఖండ సౌభాగ్యవతిగా జీవిస్తారని, పెళ్లికాని వారు ప్రేమించే భర్తను పొందుతారని నమ్ముతారు. 

కోకిలా వ్రత సంకల్పం

 "మమధనధాన్య సహిత సౌభాగ్యప్రాప్తయే
శివతుష్టయే చ కోకిలావ్రతమహం కరిష్యే" 

0/Post a Comment/Comments

Previous Post Next Post