కేసీఆర్ నిర్లక్ష్య వైఖరితోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని తెలంగాణ తెలుగు దేశం నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. శుక్రవారం రోజు ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదివేల కోట్లు ఖర్చుపెట్టి తవ్విన టన్నెల్, కేసీఆర్ చేపట్టిన రీడిజైనింగ్ వల్ల నిరుపయోగమైందన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జలయజ్ఞం సమయంలో ఖర్చు పెట్టిన డబ్బంతా వృధాగా మారిందని ఆరోపించారు.
తుమ్మిళ్ల ప్రాజెక్టు విషయంలోనూ కేసీఆర్ ఇంజినీర్ల మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లు రీడిజైనింగ్ చేస్తూ వ్యయం పెంచాలని చూస్తున్నారని రావుల ఆరోపించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రెండు లక్షల కోట్లు కావాలని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు.
Post a Comment