కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల వ్యయం పెరిగింది అన్న కాంగ్రెస్ పార్టీ విమర్శలకు రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు స్పందించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన కాలంలో తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత నది పై బ్యారేజ్ కోసం కనీసం ఒక్క అనుమతిని కూడా సాధించలేదని, మహారాష్ట్ర లోనూ, కేంద్రంలోనూ, ఇక్కడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఉన్నా మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకోలేకపోయారని దుయ్యబట్టారు. ఇప్పుడు అక్కడ బ్యారేజీ నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం అవివేకమని, కేంద్ర జలసంఘం కూడా అక్కడ నీటి లభ్యత లేదని నివేదిక ఇచ్చిందని విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించిందని, నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నెలాఖరుకు సబ్ స్టేషన్లు సిద్ధమౌతాయని, ఆగస్ట్ చివరి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పంపు నీటిని ఎత్తిపోయటం ప్రారంభిస్తుందని హరీష్ తెలియజేసారు.
కాంగ్రెస్ పార్టీ వారు అభివృద్ధి నిరోధకులని, కాళేశ్వరం ప్రాజెక్టుపైన 86 కేసులు వేసారని, అందులో హైకోర్టులో 80 కేసులు వేసారని, మూడు కేసులు సుప్రీంకోర్టులో, మరో మూడు కేసులు గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసారన్నారు.
Post a Comment